News August 29, 2025
మెదక్: ఫోటోలు, సెల్ఫీ సమయంలో జాగ్రత్త: ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవాహాల దగ్గరగా వెళ్లి చూడటం, వాటి వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీయడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు హెచ్చరించారు. సెల్ఫీ మోజు కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 30, 2025
వినాయక నిమజ్జనాల సమయంలో జాగ్రత్త: కలెక్టర్

భారీ వర్షాలు, వరదల కారణంగా మెదక్ జిల్లాలో అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. కావున వినాయక నిమజ్జనాల సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లాలో చెరువుల పరిస్థితిపై మాట్లాడారు. మెదక్ జిల్లాలో 2,632 చెరువులు భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయాయన్నారు. వినాయక నిమజ్జన సమయంలో పోలీస్, రెవెన్యూ మున్సిపల్, పంచాయితీ అధికారుల సూచనలు పాటించాలన్నారు.
News August 30, 2025
మెదక్: దెబ్బతిన్న 60 పీఆర్ రోడ్లు డ్యామేజ్

మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 29 చోట్ల కల్వర్టులు, 14 చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీర్ నర్సింలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.17.11 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.
News August 29, 2025
మెదక్: విఘ్నేశ్వర నీదే భారం.. ఎస్పీ పూజలు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పూజలు నిర్వహించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేలా పోలీసులకు మనో ధైర్యం ఇవ్వాలని వేడుకున్నారు. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రక్షణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించగా.. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి మొదటిసారిగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.