News August 29, 2025
మర్డర్ కేసు ఛేదించిన నల్గొండ పోలీసులు

NLGలో జరిగిన <<17539485>>మర్డర్ <<>>కేసును వన్ టౌన్ CI ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం 24 గంటలు గడవకముందే ఛేదించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ షేక్ సిరాజ్.. రమేశ్‌ను హత్య చేసినట్లు DSP శివరాంరెడ్డి వెల్లడించారు. సిరాజ్ రోజూ పడుకునే ప్లేస్‌లో రమేశ్ పడుకోవడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ బండరాళ్లతో కొట్టి హత్య చేశాడన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.
Similar News
News August 29, 2025
NLG: ఏఐ, కోడింగ్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ

విద్యార్థులకు ఏఐ, కోడింగ్ అంశాలను సులభంగా బోధించాలని డీఈవో భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని 29 అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలలకు చెందిన భౌతిక శాస్త్ర, గణిత ఉపాధ్యాయులకు పైథాన్ లాంగ్వేజ్, ఏఐ అంశాలపై మూడు రోజుల శిక్షణ శుక్రవారం డైట్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ రామచంద్రయ్య పాల్గొన్నారు.
News August 29, 2025
కనీస వేతనాలు అమలు చేయాలి: సీఐటీయూ

నల్గొండలోని పారిశ్రామిక కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర చట్టబద్ధ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.
News August 29, 2025
NLG: బత్తాయి తోటను పరిశీలించిన రైతు కమిషన్ బృందం

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామాన్ని శుక్రవారం తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని బత్తాయి తోటను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాలిపర్తి నాగేశ్వరావు అనే రైతు బత్తాయి తోటలో రాలిన కాయలను కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లకుమాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.