News August 29, 2025

HYD: నిందితుడి కస్టడీకి పోలీసుల పిటిషన్

image

కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్‌పల్లి పోలీసులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉండగా.. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరారు.

Similar News

News September 4, 2025

గద్వాలలో 13న కేటీఆర్ పర్యటన

image

ఈ నెల 13న మాజీ మంత్రి కేటీఆర్ గద్వాల్ జిల్లాలో పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాయచూరు రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్, మాజీ కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో BRSలో చేరుతున్నట్లు ప్రకటించారు.

News September 4, 2025

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: ఎస్పీ

image

రాజమండ్రి: ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ కోరారు. ముస్లింలందరికీ “మిలాద్- ఉన్- నబీ” శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవ జాతికి ఆదర్శమన్నారు. సామరస్యం, సోదరభావం , ఇతరుల పట్ల ప్రేమ ప్రవక్త చూపిన మార్గాలన్నారు.

News September 4, 2025

రుషికొండలో 7న శ్రీవారి ఆలయం మూసివేత

image

రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (టీటీడీ) 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్య తెలిపారు. ఆదివారం యధావిధిగా మద్యాహ్నం వరకు పూజలు, దర్శనాలు నిర్వహించి మద్యాహ్నం 1.50 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. సోమవారం ఉదయం నుంచి దర్శనాలు చేసుకోవచ్చని, కావున భక్తులు ఈ సమయ మార్పును గమనించవల్సిందిగా కోరారు.