News August 29, 2025

HYD: తోక జాడించకండి.. మిమ్మల్నే చూస్తున్నారు!

image

ఖైరతాబాద్ బడా గణేశ్‌తో పాటు నగరంలోని అనేక మండపాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇదే అదునుగా పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో HYD షీ టీమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అసభ్యంగా తాకినా, వేధింపులకు పాల్పడినా 100, 112, 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News September 4, 2025

మంత్రి లోకేశ్‌‌కు ఏపీ క్యాబినెట్ అభినందనలు

image

AP: సవాళ్లను ఎదుర్కొంటూ డీఎస్సీని నిర్వహించిన మంత్రి నారా లోకేశ్‌ను క్యాబినెట్ మంత్రులు అభినందించారు. DSCని అడ్డుకునేందుకు 72 కేసులు వేసినా ప్రతి సవాల్‌ను దీటుగా ఎదుర్కొని నిర్వహించారని కొనియాడారు. కొందరు పోలీసులు డీఎస్సీకి ఎంపికవ్వగా వీరు టీచర్ వృత్తిని ఎంచుకుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటి భర్తీకి లీగల్ సమస్యలను వేగంగా పరిష్కరిద్దామని లోకేశ్ చెప్పారు.

News September 4, 2025

దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ హనుమంతరావు

image

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మైలార్‌గూడెంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

News September 4, 2025

కృష్ణా: యూరియా సరఫరాలో ఇబ్బంది ఉంటే.. ఇలా చేయండి.!

image

జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతుల అవసరాల కోసం ఇతర జిల్లాల నుంచి యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా నుంచి 300 మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి నుంచి 200 మెట్రిక్ టన్నులు వస్తాయని తెలిపారు. ఈ యూరియాను PACS ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని, సమస్యలు ఉంటే 08672-252572లో సంప్రదించవచ్చన్నారు.