News August 29, 2025
స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం

తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్షికతో నిశ్చితార్థం జరిగినట్లు తమిళ స్టార్ హీరో విశాల్ వెల్లడించారు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధన్షికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. వేడుక ఫొటోలను పంచుకున్నారు.
Similar News
News September 4, 2025
మంత్రి లోకేశ్‌కు ఏపీ క్యాబినెట్ అభినందనలు

AP: సవాళ్లను ఎదుర్కొంటూ డీఎస్సీని నిర్వహించిన మంత్రి నారా లోకేశ్‌ను క్యాబినెట్ మంత్రులు అభినందించారు. DSCని అడ్డుకునేందుకు 72 కేసులు వేసినా ప్రతి సవాల్‌ను దీటుగా ఎదుర్కొని నిర్వహించారని కొనియాడారు. కొందరు పోలీసులు డీఎస్సీకి ఎంపికవ్వగా వీరు టీచర్ వృత్తిని ఎంచుకుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటి భర్తీకి లీగల్ సమస్యలను వేగంగా పరిష్కరిద్దామని లోకేశ్ చెప్పారు.
News September 4, 2025
ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా విధానం: PM మోదీ

GST సంస్కరణలతో దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందని PM మోదీ అన్నారు. ‘ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. కొత్త సంస్కరణల వల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుంది. రూ.లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం. ఆ మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మంచవచ్చు’ అని PM తెలిపారు.
News September 4, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.