News August 29, 2025
రేపు ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అమెరికన్ కాన్సులేట్

HYD ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం ఆగస్టు 30న HYD అమెరికన్ కాన్సులేట్ విలియమ్స్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద భద్రతను అధికారులు తనిఖీ చేశారు. ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా విలియమ్స్ తెలిపారు.
Similar News
News September 4, 2025
మంత్రి లోకేశ్‌కు ఏపీ క్యాబినెట్ అభినందనలు

AP: సవాళ్లను ఎదుర్కొంటూ డీఎస్సీని నిర్వహించిన మంత్రి నారా లోకేశ్‌ను క్యాబినెట్ మంత్రులు అభినందించారు. DSCని అడ్డుకునేందుకు 72 కేసులు వేసినా ప్రతి సవాల్‌ను దీటుగా ఎదుర్కొని నిర్వహించారని కొనియాడారు. కొందరు పోలీసులు డీఎస్సీకి ఎంపికవ్వగా వీరు టీచర్ వృత్తిని ఎంచుకుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటి భర్తీకి లీగల్ సమస్యలను వేగంగా పరిష్కరిద్దామని లోకేశ్ చెప్పారు.
News September 4, 2025
దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ హనుమంతరావు

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మైలార్‌గూడెంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
News September 4, 2025
కృష్ణా: యూరియా సరఫరాలో ఇబ్బంది ఉంటే.. ఇలా చేయండి.!

జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతుల అవసరాల కోసం ఇతర జిల్లాల నుంచి యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా నుంచి 300 మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి నుంచి 200 మెట్రిక్ టన్నులు వస్తాయని తెలిపారు. ఈ యూరియాను PACS ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని, సమస్యలు ఉంటే 08672-252572లో సంప్రదించవచ్చన్నారు.