News August 29, 2025
మాస్టర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పీఎం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం 63 మంది మాస్టర్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 మండలాల పరిధిలో 35 గ్రామాలలో అమలుచేసే గిరిజన జనాభాకు అందుబాటులో ఉన్న వనరులు పరిశీలించారు. ఇంకా ఏమేమి వసతులు కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 2, 2025
వరదల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాస చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, వెంటనే యూసీలను సమర్పించాలని ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.
News September 2, 2025
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఖమ్మం విద్యార్ధి

ప్రతిభకు వయస్సు అడ్డుకాదని ఖమ్మం జిల్లాకు చెందిన బచ్చుపల్లి ఇషాన్ నిరూపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే సాధనతో ఈ రికార్డును సాధించిన ఇషాన్, తన పాఠశాలకే కాకుండా ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఇషాన్ ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, స్థానికులు అభినందించారు.
News September 2, 2025
స్థానిక ఎన్నికలు.. ‘ఆమె’ కీలకం

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.