News August 29, 2025
విరూపాక్షపురం మందుకోసం నైజీరియా నుంచి రాక

బైరెడ్డిపల్లి(M) విరూపాక్షపురం పక్షవాత ఆయుర్వేద వైద్యానికి ప్రత్యేకమని స్థానికులు పేర్కొన్నారు. తాజాగా ఇక్కడికి మందుకోసం నైజీరియా నుంచి నలుగురు వచ్చారు. వారు మాట్లాడుతూ.. తాము గత నెల 12న ఓ సారి మందు తీసుకున్నామని, రెండో విడత కోసం ఇవాళ వచ్చామన్నారు. మరోసారి మందు తీసుకోవాల్సి ఉందని, ఇప్పటికే ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి పెరాలిసిస్ రోగులు వస్తుంటారని స్థానికులు తెలిపారు.
Similar News
News September 4, 2025
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డ నిందితుడికి తిరుపతి రెడ్ శాండిల్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2018 జూన్ లో వెదురుకుప్పం మండలం పచ్చికాపలం- తిరుపతి రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో సత్యవేడు మండలానికి చెందిన మహేంద్ర పట్టుపడ్డాడు. నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష విధించారు.
News September 4, 2025
KPM: నీళ్లు ఆగిపోయాని ప్రచారం.. కేసు నమోదు

హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని ప్రచారాలు చేసిన వారిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు X వేదికగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News September 4, 2025
చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కలిశారు.