News August 29, 2025
సంజయ్ కస్టడీ పిటిషన్.. SEP 1న ఉత్తర్వులు

AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ <<17522825>>పోలీస్ కస్టడీపై<<>> విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విని సెప్టెంబర్ 1న ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం వెల్లడించింది. విచారణ కోసం సంజయ్‌ను వారం రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. కాగా అగ్నిమాపక శాఖలో టెక్నాలజీ పేరిట ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ విచారణలో తేలడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
Similar News
News September 3, 2025
అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.
News September 3, 2025
‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్

TG: CM రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.
News September 3, 2025
నాకు లాంగ్ హనీమూన్ కావాలి: జాన్వీ కపూర్

తన పెళ్లి, హనీమూన్ గురించి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ఇంతకుముందు చెప్పినట్లే నా పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది. అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లాడతా. వివాహ తంతు త్వరగా ముగిసేలా చూసుకుంటా. కానీ హనీమూన్ మాత్రం చాలా లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్.