News August 29, 2025

త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: మోదీ

image

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించిన వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కొనసాగుతోందన్నారు. ప్రపంచ వృద్ధిలో 18శాతం ఇండియాదేనని పేర్కొన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జపాన్‌లో పర్యటిస్తున్న ఆయన ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడారు. ఇండియాకు అత్యంత విశ్వసనీయ దేశం జపాన్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Similar News

News September 3, 2025

అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

image

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.

News September 3, 2025

‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.

News September 3, 2025

నాకు లాంగ్ హనీమూన్ కావాలి: జాన్వీ కపూర్

image

తన పెళ్లి, హనీమూన్ గురించి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ఇంతకుముందు చెప్పినట్లే నా పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది. అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లాడతా. వివాహ తంతు త్వరగా ముగిసేలా చూసుకుంటా. కానీ హనీమూన్ మాత్రం చాలా లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్.