News August 29, 2025

మహిళల క్రికెట్ కోసం గూగుల్‌తో ICC ఒప్పందం

image

ఉమెన్ క్రికెట్‌ను గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు గూగుల్ సంస్థతో ICC ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉమెన్ క్రికెట్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఈవెంట్లను ప్రమోట్ చేయడంలో ఈ పార్ట్‌నర్‌షిప్ కీలకంగా వ్యవహరించనుంది. ఆండ్రాయిడ్, గూగుల్ జెమిని, గూగుల్ పిక్సెల్, గూగుల్ పే వంటి సర్వీసెస్ ద్వారా ఉమెన్ క్రికెట్‌ను ప్రమోట్ చేయనున్నారు.

Similar News

News August 29, 2025

ఆ వీడియోలో ఉన్నవాళ్లంతా టీడీపీనే: వైసీపీ

image

AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే <<17554192>>కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి<<>> హత్య ప్లాన్‌లో ఉన్నదంతా టీడీపీ కార్యకర్తలేనని వైసీపీ ట్వీట్ చేసింది. వారంతా కోటంరెడ్డి బ్రదర్స్, రూప్ కుమార్ అనుచరులేనని కౌంటరిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కోటంరెడ్డి మర్డర్ ప్లాన్ అంటూ వీడియో క్రియేట్ చేశారని ఆరోపించింది. జగదీశ్, వినీత్, మహేశ్ టీడీపీ కార్యకర్తలేనని నాయకులతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

News August 29, 2025

‘AA22’లో కమెడియన్ యోగిబాబు!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న ‘AA22’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ముంబైలో షూట్ జరుగుతోందని, ఇందులో మృణాల్ & యోగిబాబు కూడా నటిస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. యోగిబాబు రోల్ ఉండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుందని అంటున్నారు. అట్లీ-షారుఖ్ కాంబోలో వచ్చిన ‘జవాన్’లోనూ ఈయన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

News August 29, 2025

ప్రో కబడ్డీ లీగ్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 అట్టహాసంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో లీగ్ మొదలైంది. ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కోర్టులో కబడ్డీ, క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు. కాగా తొలి మ్యాచులో భాగంగా తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ తలపడుతున్నాయి.