News August 29, 2025
సిద్దిపేట: ‘రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి’

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు మునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ హైమావతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వర్షాలతో ఇళ్లు కూలిపోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగిపోయిన వాటిని మరమ్మతులు చేయాలని కోరారు.
Similar News
News September 2, 2025
సంగారెడ్డి: 4 వరకు మళ్లీ ఉపాధ్యాయుల సర్దుబాటు

జిల్లాలో ఉపాధ్యాయ సర్దుబాటు మళ్లీ నిర్వహించాలని పాఠశాల డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 4వ తేదీ వరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఎంఈఓలకు ఆదేశించారు. ఎంఈఓ నుంచే నివేదికలు రాగానే ఖాళీ స్థానాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
News September 2, 2025
ADB: చేసేదే అక్రమ దందా.. ఆపై పబ్లిసిటీ

ఉమ్మడి ADBలో ఇసుక, మొరం అక్రమ దందాకు అదుపు లేకుండా పోయింది. వాగుల్లోంచి ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండటం పరిపాటిగా మారింది. పలు మండలాల్లో మొరం దందా కూడా కొనసాగుతోంది. మంచి పేరున్న పలువురు నేతలు అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి అమ్ముకుంటున్నారు. రోడ్లపై కొన్ని గుంతలు పూడ్చి తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం గమనార్హం. లోకల్ ఎలక్షన్లు వచ్చాయని ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
News September 2, 2025
నవ వధువు ఆత్మహత్య.. వేధింపులే కారణం?

నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గంలో జరిగింది. యువతి రూప (19)కు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన అనిల్‌తో 3 నెలల క్రితం వివాహమైంది. శనివారం ఆమె విషద్రావణం తాగగా కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. భర్త, అత్త వేధింపులతోనే తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.