News August 29, 2025

NGKL: సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 460 GPలకు, 4,102 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి ప్రచురించామని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి, అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.

Similar News

News September 2, 2025

సంగారెడ్డి: 4 వరకు మళ్లీ ఉపాధ్యాయుల సర్దుబాటు

image

జిల్లాలో ఉపాధ్యాయ సర్దుబాటు మళ్లీ నిర్వహించాలని పాఠశాల డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 4వ తేదీ వరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఎంఈఓలకు ఆదేశించారు. ఎంఈఓ నుంచే నివేదికలు రాగానే ఖాళీ స్థానాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News September 2, 2025

ADB: చేసేదే అక్రమ దందా.. ఆపై పబ్లిసిటీ

image

ఉమ్మడి ADBలో ఇసుక, మొరం అక్రమ దందాకు అదుపు లేకుండా పోయింది. వాగుల్లోంచి ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండటం పరిపాటిగా మారింది. పలు మండలాల్లో మొరం దందా కూడా కొనసాగుతోంది. మంచి పేరున్న పలువురు నేతలు అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి అమ్ముకుంటున్నారు. రోడ్లపై కొన్ని గుంతలు పూడ్చి తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం గమనార్హం. లోకల్ ఎలక్షన్లు వచ్చాయని ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

News September 2, 2025

నవ వధువు ఆత్మహత్య.. వేధింపులే కారణం?

image

నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గంలో జరిగింది. యువతి రూప (19)కు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన అనిల్‌తో 3 నెలల క్రితం వివాహమైంది. శనివారం ఆమె విషద్రావణం తాగగా కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. భర్త, అత్త వేధింపులతోనే తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.