News August 29, 2025

ఒంగోలు: ‘మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలి’

image

మాతృభాష తెలుగు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టరుతో పాటు డీఆర్ఓ చిన ఓబులేసు, ఇతర అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గిడుగు సేవలను వారు కొనియాడారు.

Similar News

News August 30, 2025

గిద్దలూరులో రైతు బజార్ స్థల సమీకరణకు ఎమ్మెల్యే అశోక్‌కు వినతి

image

గిద్దలూరు పట్టణంలో శుక్రవారం MLA అశోక్ రెడ్డిను జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు వరలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు రైతు బజారు ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణకు వివరాలు తెలుసుకున్నారు. రైతుల కోసం కూటమి ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

News August 29, 2025

పెన్షన్ల తొలగింపుపై ప్రకాశం కలెక్టర్ క్లారిటీ ఇదే

image

ప్రకాశం జిల్లాలో పెన్షన్లపై కలెక్టర్ తమీమ్ అన్సారియా కీలక ప్రకటన చేశారు. జిల్లాలో 4,654 మందిని పెన్షన్లకు అనర్హులుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిందన్నారు. వీరిలో అర్హతను బట్టి 1,062 మంది పెన్షన్లను వికలాంగ, వృద్ధాప్య పెన్షన్లుగా మార్పు చేశామని చెప్పారు. మిగిలిన 3,592 పెన్షన్లలో 791 మందికి మినహాయింపు ఉందని, 2,801 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అప్పీల్ చేసుకున్నవారికి 1న పింఛన్ అందుతుందని తెలిపారు.

News August 29, 2025

ఒంగోలు: ప్రైవేటు ఆసుపత్రుల్లో సోదాలు

image

ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి .వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం తొమ్మిది టీములు వైద్యశాలలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.