News August 29, 2025

గుంటూరు: తెలుగు భాషా సేవకుడు కొండా వెంకటప్పయ్య

image

తెలుగు భాషా సేవకుడు కొండా వెంకటప్పయ్య గుంటూరు జిల్లాకు చెందినవారే. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమానికి ఆద్యుడిగా పేరొందారు. తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన ఆయన.. 1902లో మొదటి తెలుగు వార్తాపత్రిక ‘కృష్ణా పత్రిక’ను ప్రారంభించారు. 1913లో రాష్ట్రసాధన కోసం ఏర్పడిన ఆంధ్ర మహాసభలో కీలకపాత్ర పోషించారు. తెలుగు ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఏర్పడిన రాయబార వర్గానికి నాయకత్వం వహించారు.

Similar News

News August 29, 2025

ప్రో కబడ్డీ లీగ్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 అట్టహాసంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో లీగ్ మొదలైంది. ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కోర్టులో కబడ్డీ, క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు. కాగా తొలి మ్యాచులో భాగంగా తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ తలపడుతున్నాయి.

News August 29, 2025

నాగర్‌కర్నూల్: హత్య చేసిన నిందితుల అరెస్ట్

image

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కోడేరుకు చెందిన రంగసాని హత్య ఘటనపై శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసులు పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కోడేరు మండలం మైలారం గ్రామ వాసి రంగసాని, బల్మూరు మండలం మైలారం గ్రామ వాసి పులిందర్ గౌడ్‌కు గుప్త నిధులు ఆశ చూపి రూ.5,00,000 తీసుకొని మోసం చేశాడని, దీంతో పులిందర్ గౌడ్ ఆరుగురితో కలిసి రంగసానిని హత్య చేశాడని తెలిపారు.

News August 29, 2025

రామగుండం జోన్‌కు ఐఎంఎస్ విద్యార్థులు

image

పాలకుర్తిలో జరిగిన క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇండియా మిషన్ స్కూల్ (ఐఎంఎస్)కు చెందిన పదిమంది విద్యార్థులు రామగుండం జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులు నేటి నుండి ఎన్టీపీసీలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మహేంద్ర, కోచ్ కృష్ణమూర్తి గౌడ్, అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.