News August 29, 2025

సీఎంను కలిసిన సందీప్ రెడ్డి వంగా

image

TG: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. సందీప్ రెడ్డి వెంట అతడి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నారు. 2013లో ప్రణయ్ రెడ్డి భద్రకాళి ప్రొడక్షన్స్‌ను స్థాపించారు. దీని కింద అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను నిర్మించారు. ప్రభాస్ ‘స్పిరిట్’నూ ఈ సంస్థే నిర్మిస్తోంది.

Similar News

News February 4, 2026

ఆత్మవిశ్వాసానికి సంకేతం ‘మణిపూరక చక్రం’

image

బొడ్డు భాగంలో ఉండే ఈ చక్రం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఇది సమతుల్యంగా ఉంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు, మంచి జీర్ణక్రియ కలుగుతాయి. ఇది అస్థిరంగా మారితే అజీర్తి, షుగర్, ఎదుటివారిపై అధికారం చెలాయించే స్వభావం పెరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘రం’ మంత్రాన్ని ధ్యానించాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం, సూర్యరశ్మిలో గడపడం, యోగ, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ చక్రాన్ని మేల్కొల్పవచ్చు.

News February 4, 2026

ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

image

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.

News February 4, 2026

‘నాన్‌వెజ్‌’ విక్రయాలపై హైకోర్టు కీలక సూచనలు

image

TG: మాంసం, నాన్‌వెజ్‌ పదార్థాల విక్రయంపై సర్కారుకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. గుడులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్‌ పదార్థాలను అమ్మకుండా ఓ విధానం రూపొందించాలని సూచించింది. భక్తుల మనోభావాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు తయారు చేయాలంది. మాంసం దుకాణాల ప్రారంభానికి పోలీస్‌ స్టేషన్‌ నుంచి NOC పొందాలనే నిబంధన చేర్చాలని తెలిపింది.