News August 29, 2025

త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు: మంత్రి

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కోసం త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం అమలు కోసం రూ.95 కోట్లు ఖర్చు చేశామని, త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. 60% మంది మహిళలు RTC బస్సులు ఎక్కుతున్నారని, ఈ పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు.

Similar News

News January 24, 2026

800 ఉరిశిక్షలు ఆపానని ట్రంప్ ప్రకటన.. అంతా ఉత్తదేనన్న ఇరాన్

image

తన జోక్యంతో 800కు పైగా నిరసనకారుల <<18930505>>మరణశిక్షలు<<>> ఆగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. అందులో నిజం లేదని స్పష్టంచేసింది. ‘ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఆ స్థాయిలో మరణశిక్షలు లేవు. న్యాయవ్యవస్థ కూడా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు’ అని ఇరాన్ టాప్ ప్రాసిక్యూటర్ మహ్మద్ మొవహేదీ చెప్పారు. కాగా ఇరాన్ వైపు యుద్ధ నౌకలు వెళ్తున్నాయని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.

News January 24, 2026

రాష్ట్రంలో 859 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులై, వయసు 18 -46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైప్ టెస్ట్, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, EWS, PwBDలకు రూ.400. సైట్: tshc.gov.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 24, 2026

BCB కంప్లైంట్.. తిరస్కరించిన DRC

image

భారత్‌లో T20 WC ఆడేది లేదని తేల్చి చెప్పిన BCB నిన్న ICC వివాద పరిష్కార కమిటీ(DRC)ని ఆశ్రయించింది. INDలో ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది. అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.