News August 29, 2025

థాయిలాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు

image

థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాను పదవి నుంచి తొలగించింది. పీఎంకి ఉండాల్సిన నైతిక ప్రమాణాలను ఆమె పాటించలేదని కోర్టు పేర్కొంది. కాల్పుల విరమణ సమయంలో ఆమె కంబోడియా మాజీ నేత హున్ సేన్‌తో మరీ లొంగిపోయినట్టు మాట్లాడిన ఆడియో ఇందుకు కారణంగా మారింది. ఆమె తొలగింపుతో ఇప్పుడు కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 28, 2026

2023లోనూ ఆ విమానానికి ప్రమాదం!

image

అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి సంచలన విషయం బయటికొచ్చింది. ఇదే విమానం 2023 సెప్టెంబర్‌లోనూ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. VSR వెంచర్స్ ఆపరేట్ చేస్తున్న Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. ఆ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఇప్పుడు కూడా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.

News January 28, 2026

విమాన ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ జరగాలి: మమతా బెనర్జీ

image

మహారాష్ట్ర బారామతిలో విమానం కుప్పకూలిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

News January 28, 2026

ఫ్లైట్ క్రాష్‌లలో చనిపోయిన ప్రముఖులు.. (1/2)

image

నేతాజీ 1945లో తైవాన్ విమాన ప్రమాదంలో అదృశ్యమవగా 1966లో అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్విట్జర్లాండ్ క్రాష్‌లో కన్నుమూశారు. 1973లో కేంద్ర గనుల మంత్రి మోహన్ కుమారమంగళం, 1980లో 34సం.ల సంజయ్ గాంధీ, 1994లో పంజాబ్ గవర్నర్ సురేంద్ర, 1997లో కేంద్ర రక్షణ సహాయ మంత్రి NVN సోము క్రాష్‌లలో మృతిచెందారు. 2001లో విమానయాన మంత్రి మాధవరావ్ సింథియా, 2002లో లోక్‌సభ స్పీకర్ బాలయోగి చాపర్ ప్రమాదాల్లో చనిపోయారు.