News August 29, 2025
ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు కావాలి: మంత్రి శ్రీధర్ బాబు

విఘ్నాలను తొలగించే గణనాథుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. శుక్రవారం మంథనిలోని గాంధీచౌక్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడతామన్నారు.
Similar News
News August 29, 2025
గద్వాల: సుంకేసుల బ్యారేజీకి 18 వేల క్యూసెక్కుల వరద

గద్వాల జిల్లా రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం 18,000 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో అధికారులు బ్యారేజీ మూడు గేట్లు తెరిచి 15,484 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 2,012 క్యూసెక్కులు, మొత్తం 17,496 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో సుంకేసుల బ్యారేజీకి వరద తగ్గింది.
News August 29, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ WGL: తహశీల్దార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
✓ వరంగల్ పరిధిలో 21 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు
✓ సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్
✓ హత్య కేసులో నలుగురికి యావజ్జీవ శిక్ష
✓ డీజే అనుమతులు బంద్: ముల్కనూర్ SI
✓ కాజీపేట వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
✓ యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు: MLA గండ్ర
✓ ఆత్మకూరు: లోన్ యాప్స్ జోలికి పోవద్దు: ఇన్స్పెక్టర్ సంతోష్
News August 29, 2025
భారత మహిళా క్రికెటర్లతో లోకేశ్

AP: క్రీడలను ప్రోత్సహించడానికే 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖలో ‘బ్రేకింగ్ బౌండరీస్ విత్ లోకేశ్’ పేరిట భారత మహిళా క్రికెటర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబుకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి ఏపీలో ఏషియన్ గేమ్స్ నిర్వహించారని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో మిథాలీ రాజ్, స్మృతి మందాన, దీప్తి శర్మ, శృతి తదితరులు పాల్గొన్నారు.