News August 29, 2025

నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి: ఎస్పీ కిరణ్ ఖరే

image

నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మహిళల భద్రత, నేరాలు, రాత్రి పహారా బలోపితంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు.

Similar News

News August 29, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం
☞ తోట్లవల్లూరులో వృద్ధ దంపతులపై హిజ్రాల దాడి
☞ కృష్ణా: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ
☞ కృష్ణాలో వర్క్ ఫ్రం హోం కోసం సర్వే
☞  కృష్ణా: DSC డీఎస్సీ 95% అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి
☞ విజయవాడలో డ్రగ్స్ తో పట్టుబడ్డ ప్రేమికులు

News August 29, 2025

మెదక్‌లో 8 మంది కామారెడ్డి విద్యార్థులకు పునరావాసం

image

కామారెడ్డి జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు ఇటీవల మెదక్‌కు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షాల కారణంగా పోచారం డ్యామ్ పొంగిపొర్లడంతో పోచమ్మరాల్ వద్ద చిక్కుకుపోయారు. 2 రోజులుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులను గుర్తించిన రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థులను హవేలీఘనాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర వసతి గృహానికి తరలించారు.

News August 29, 2025

జగిత్యాలలో గణేష్ చతుర్థికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

image

గణేష్ చతుర్థి వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జగిత్యాల పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. నిరంతర పర్యవేక్షణ, పికెటింగ్, మెరుగైన విజిబుల్ పోలీసింగ్‌తో భద్రతను ముమ్మరం చేశారు. పండుగ సజావుగా సాగేందుకు అన్ని ముందు జాగ్రత్తలు అమలులో ఉన్నాయి. శాంతి, సామరస్యంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు.