News August 29, 2025

గద్వాల: ‘రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం’

image

గద్వాల జిల్లాలో యూరియా సరఫరా కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో రైతులకు యూరియా సరఫరా చేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయించడంతోపాటు అధికారులు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించారని చెప్పారు.

Similar News

News August 29, 2025

గద్వాల: ‘తుది ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి’

image

తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలోని ఆయన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని జీపీ ఆఫీసుల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ఈనెల 28న ప్రదర్శించామన్నారు. 30 వరకు అభ్యంతరాల స్వీకరించి 31న పరిష్కరిస్తామన్నారు.

News August 29, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ మంగళగిరిలో 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ధననాథుడు
☞ అలజడులు సృష్టించేందుకు YCP కుట్ర: జూలకంటి  
☞ తెనాలిలో రెండు టన్నుల భారీ శివలింగం లడ్డు
☞ ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య అవగాహన ఒప్పందం
☞ మంగళగిరిలో రెండు రైళ్లల్లో చోరీలు
☞ మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
☞ పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో బిగ్ షాక్
☞ తుళ్లూరులో జాబ్ మేళా.. 91 మందికి ఉద్యోగాలు

News August 29, 2025

ఆదిలాబాద్: మట్కా కేసులో నిందితుడు అరెస్ట్

image

మట్కా కేసులో నిందితుడిని పోలీసులు ఎనిమిదేళ్ల అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన మొహ్మద్ లతీఫ్ మట్కా నిర్వహిస్తుండగా 2018లో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అతను పరారవ్వగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయటానికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయగా శుక్రవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.