News August 29, 2025
MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి..!

SBI, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (SBI RSETY) ఆధ్వర్యంలో ఉమ్మడి MBNR జిల్లా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఈరోజు తెలిపారు. ఉచిత బ్యూటిషన్, ఎంబ్రాయిడరీలకు ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలకు MBNR బండమీదిపల్లిలోని SBI RSETY సెంటర్‌లో లేదా 99633 69361, 95424 30607 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News August 29, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం
☞ తోట్లవల్లూరులో వృద్ధ దంపతులపై హిజ్రాల దాడి
☞ కృష్ణా: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ
☞ కృష్ణాలో వర్క్ ఫ్రం హోం కోసం సర్వే
☞ కృష్ణా: DSC డీఎస్సీ 95% అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి
☞ విజయవాడలో డ్రగ్స్ తో పట్టుబడ్డ ప్రేమికులు
News August 29, 2025
మెదక్‌లో 8 మంది కామారెడ్డి విద్యార్థులకు పునరావాసం

కామారెడ్డి జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు ఇటీవల మెదక్‌కు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షాల కారణంగా పోచారం డ్యామ్ పొంగిపొర్లడంతో పోచమ్మరాల్ వద్ద చిక్కుకుపోయారు. 2 రోజులుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులను గుర్తించిన రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థులను హవేలీఘనాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర వసతి గృహానికి తరలించారు.
News August 29, 2025
జగిత్యాలలో గణేష్ చతుర్థికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

గణేష్ చతుర్థి వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జగిత్యాల పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. నిరంతర పర్యవేక్షణ, పికెటింగ్, మెరుగైన విజిబుల్ పోలీసింగ్‌తో భద్రతను ముమ్మరం చేశారు. పండుగ సజావుగా సాగేందుకు అన్ని ముందు జాగ్రత్తలు అమలులో ఉన్నాయి. శాంతి, సామరస్యంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు.