News August 29, 2025

RECORD: 4 బంతుల్లో 4 వికెట్లు

image

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌తో మ్యాచులో నార్త్ జోన్ ఫాస్ట్ బౌలర్ ఆఖిబ్ నబీ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. 53వ ఓవర్లో చివరి 3 బంతులకు 3 వికెట్లతో హ్యాట్రిక్ సాధించిన అతడు, తాను వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి మరో వికెట్ తీశారు. దీంతో ఈ టోర్నీలో 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మొత్తంగా 5 వికెట్లు సాధించారు. ఇది ఆయనకు డెబ్యూ మ్యాచ్ కావడం గమనార్హం.

Similar News

News August 29, 2025

ఒకేసారి 5 ఉద్యోగాలు కొట్టిన ‘అమ్మ’

image

AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరుబుజ్జిలి(M) మతలబుపేటకు చెందిన చింతా రాధాకుమారి-కేఎల్ నాయుడుకు ఇద్దరు పిల్లలు. ఎప్పటికైనా టీచర్ కావాలనే ఆశయంతో సంసారాన్ని నడిపిస్తూనే రాధ MA, లాంగ్వేజ్ పండిట్ కోర్స్, TTC, B.Ed పూర్తి చేశారు. ఇటీవల ప్రకటించిన DSCలో SGT-14, SA తెలుగు-23, SA సోషల్-39, TGT తెలుగు-113,TGT సోషల్‌లో 77వ ర్యాంక్ సాధించారు.

News August 29, 2025

భారత మహిళా క్రికెటర్లతో లోకేశ్

image

AP: క్రీడలను ప్రోత్సహించడానికే 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖలో ‘బ్రేకింగ్ బౌండరీస్ విత్ లోకేశ్’ పేరిట భారత మహిళా క్రికెటర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబుకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి ఏపీలో ఏషియన్ గేమ్స్ నిర్వహించారని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో మిథాలీ రాజ్, స్మృతి మందాన, దీప్తి శర్మ, శృతి తదితరులు పాల్గొన్నారు.

News August 29, 2025

శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ.. జింబాబ్వేకు హార్ట్ బ్రేక్

image

జింబాబ్వేతో తొలి వన్డేలో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆ జట్టుపై 7 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 298/6 పరుగులు చేసింది. నిస్సాంక(76), లియనగే(70*) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 291/8 పరుగులు చేసి పోరాడి ఓడింది. సికందర్ రజా(92) ఒంటరి పోరాటం చేశారు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా శ్రీలంక బౌలర్ మధుశంక హ్యాట్రిక్ వికెట్లు తీసి, 2రన్సే ఇచ్చారు.