News August 29, 2025
నిజామాబాద్: రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్

హైదరాబాద్‌లో రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో పాల్గొనే శాతవాహన జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో తమ శిక్షణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జట్టుకు జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.
Similar News
News August 29, 2025
నిజామాబాద్: రాష్ట్రంలోనే టాప్ తూంపల్లి

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.
News August 29, 2025
NZB: బేస్‌బాల్ నేషనల్స్‌కు జీజీ కాలేజ్ విద్యార్థులు

జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్‌షిప్‌కు గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలమణి తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన మహిళల జట్టులో జి.శృతి, పురుషుల జట్టులో కే.సాయికుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 29 నుంచి మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే 38వ సీనియర్ నేషనల్ బేస్ బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.
News August 29, 2025
NZB: ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.