News August 29, 2025
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: SP

కురిసిన కుండ పోత వర్షాలకు ముంపునకు గురైన బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్‌లోని రైతు వేదికలో బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విపత్తు నిర్వహణ బృంద సభ్యులకు కలిసి అభినందించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు.
Similar News
News August 29, 2025
GDK: ‘తెలంగాణ యూరియా కొరతపై పార్లమెంట్లో ప్రస్తావించా’

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతపై పార్లమెంటులో ప్రస్తావించానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చే యూరియా కోటాను పూర్తి స్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులను కోరానని, రామగుండంలో ఎయిర్పోర్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాల గురించి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశానని అన్నారు.
News August 29, 2025
క్రీడాకారులకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా: మంత్రి లోకేశ్

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఇవ్వనున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖీలో మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడల్లో బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌ల కొరత ఉందన్నారు. 43 వేల పాఠశాలలు ఉన్నా తగినంతమంది పీఈటీలు లేరన్నారు.
News August 29, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా స్పోర్ట్స్ డే
> స్టేషన్ ఘనపూర్: యూరియా కోసం రైతుల పడిగాకులు
> దేవాదాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష
> కొడకండ్ల: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత
> మేకలగట్టు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్
> ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
> ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్
> దేవరుప్పుల: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ