News August 29, 2025

MBNR: బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది: మాజీ మంత్రి

image

కామారెడ్డి డిక్లరేషన్‌తోనే కాంగ్రెస్ గెలిచిందని, ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి, MBNR మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లు ఒక్కరూ లేరని, కాంగ్రెస్‌కి బీసీలపై మనసంతా విషమే ఉందన్నారు. కేసీఆర్ ఒక ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చారని, అంత మంది ఎంపీలు ఉన్న మీరు ఎందుకు బీసీ బిల్‌ని పాస్ చేపించడం లేదని ప్రశ్నించారు.

Similar News

News August 30, 2025

పెద్దపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

image

పెద్దపల్లి జిల్లాలో గత 24 గంటల్లో వర్షాలు విస్తృతంగా కురిశాయి. రామగిరిలో 83.3 మి.మీ, కమాన్‌పూర్ 75.6, జూలపల్లి 54.4, ముత్తారం 46.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి 34.9, ధర్మారం 27.9, ఎలిగేడు 26.0, పాలకుర్తి 16.8 ఓదెల 12.4, శ్రీరాంపూర్ 18.7 మి.మీ. వర్షం కురిసింది. అంతర్గాంలో 8.4, మంథని 7.0, రామగుండం 6.1 తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News August 30, 2025

నాకు కులం, మతంతో పని లేదు: పవన్

image

AP: కులం, మత, ప్రాంతాలకు జనసేన అతీతం అని పవన్ అన్నారు. ‘నేను ఇస్లాం, క్రిస్టియన్ ఇతర మతాలను ఎంతో గౌరవిస్తాను. నాకు కులం, మతంతో పనిలేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను, వారి సంప్రదాయాలను, మనోభావాలను కించపరిచే వారి విషయంలో సూటిగా మాట్లాడతాను. నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడగలిగే ధైర్యం నాకు ఉంది. ఒక మాట మాట్లాడితే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం లేదు’ అని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.

News August 30, 2025

నారాయణపేట: జిల్లా సర్వే నివేదిక కమిటీ ఏర్పాటు

image

జిల్లా సర్వే నివేదిక కమిటీని ఏర్పాటు చేసేందుకు శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత గడువులోపు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా సర్వే నివేదికను రాష్ట్ర కాలుష్య మండలికి అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.