News August 29, 2025

ADB: ‘ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర కీలకం’

image

సమాజంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనదని, తమ వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలని మాదిగ జాగృతి సంఘం జిల్లాధ్యక్షుడు ఆడేల్లు అన్నారు. ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మాదిగ జాగృతి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు పదోన్నతులు పొందిన పలువురు ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. విధినిర్వహణలో నిబంధనలు పాటిస్తూ సమాజం మేలు కోసం కృషి చేయాలని సూచించారు.

Similar News

News August 29, 2025

ఆదిలాబాద్: మట్కా కేసులో నిందితుడు అరెస్ట్

image

మట్కా కేసులో నిందితుడిని పోలీసులు ఎనిమిదేళ్ల అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన మొహ్మద్ లతీఫ్ మట్కా నిర్వహిస్తుండగా 2018లో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అతను పరారవ్వగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయటానికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయగా శుక్రవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.

News August 29, 2025

ADB: పంచాయతీ ఎన్నికలపై ఆల్ పార్టీ మీటింగ్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, నియమావళిని వివరించి పలు సూచనలు చేశారు. సమావేశంలో JC శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ ఉన్నారు.

News August 29, 2025

ఆదిలాబాద్: ITIలో చేరేందుకు రేపే చివరి తేదీ

image

ఐటీఐ కళాశాలలో చేరేందుకు రేపటితో ప్రవేశాల గడువు ముగుస్తుందని ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ATCలో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు వెల్లడించారు. ITIలో ఇంకా 11 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. డ్రెస్ మేకింగ్ ట్రేడ్‌లో 4, స్టెనోగ్రఫీలో 3, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్‌లో 4 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.