News August 29, 2025
పోలీసులపై MLA కోటంరెడ్డి ఆగ్రహం?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని <<17554192>>హత్య <<>>చేసేందుకు కొందరు మాట్లాడిన వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. హత్య కుట్రకు సంబంధించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నా తనకు ఎందుకు చెప్పలేదని వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై తనను ఇకపై కలిసే ప్రయత్నం చేయవద్దని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. హత్య కుట్రపై శనివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడతారని సమాచారం.
Similar News
News August 30, 2025
నెల్లూరు-తడ రోడ్డు విస్తరణకు అమోదం

నెల్లూరు-తడ హైవేను ఆరు లైన్లుగా విస్తరించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 110 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరణఖు టెండర్లు పిలుస్తున్నట్లు NHAI ప్రకటించింది. రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ ఇదే అంశంపై రాజ్యసభలో మాట్లాడారు. అలాగే NHAI ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో చర్చించడంతో రోడ్డు విస్తరణకు పచ్చజెండా ఊపారు.
News August 29, 2025
కోటంరెడ్డికి హోం మంత్రి ఫోన్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోం మంత్రి అనిత ఫోన్ చేశారు. రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై ఎమ్మెల్యేతో ఆమె మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీడియోలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
News August 29, 2025
గిడుగు ఆలోచనలను అర్థం చేసుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి

భవిష్యత్ తరాలకు మాతృ భాష మాధుర్యాన్ని చేరువ చేసేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ హాలులో తెలుగు భాష ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గిడుగు ఆలోచనను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని సూచించారు. వాడుక భాష వాడకం పెరగడంతో పాటు, మన ప్రాచీన సాహిత్యాన్ని సైతం అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి అందరూ కృషి చేయాలని కోరారు.