News August 29, 2025
‘మహావతార్ నరసింహ’కు భారీగా కలెక్షన్స్

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై నెల రోజులు దాటినా ప్రేక్షకుల నుంచి ఇంకా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీలో మహావిష్ణువు అవతారాలపై మరిన్ని సినిమాలు రానున్నాయి.
Similar News
News August 30, 2025
నాకు కులం, మతంతో పని లేదు: పవన్

AP: కులం, మత, ప్రాంతాలకు జనసేన అతీతం అని పవన్ అన్నారు. ‘నేను ఇస్లాం, క్రిస్టియన్ ఇతర మతాలను ఎంతో గౌరవిస్తాను. నాకు కులం, మతంతో పనిలేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను, వారి సంప్రదాయాలను, మనోభావాలను కించపరిచే వారి విషయంలో సూటిగా మాట్లాడతాను. నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడగలిగే ధైర్యం నాకు ఉంది. ఒక మాట మాట్లాడితే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం లేదు’ అని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
News August 30, 2025
డిసెంబర్‌లో ఇండియాకు పుతిన్!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత పర్యటనకు రానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత మేలో ప్రధాని మోదీ పుతిన్‌ను ఇండియాకు రావాలని ఆహ్వానించారు. కాగా సెప్టెంబర్ 1న చైనాలో జరిగే ప్రాంతీయ సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కలవనున్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
News August 30, 2025
రిటైర్మెంట్ వయసు పెంపుపై తప్పుడు ప్రచారం: FactCheck

AP: పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు/ కార్పొరేషన్లు/ సొసైటీలలో పని చేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ఓ నకిలీ జీవో చక్కర్లు కొడుతోందని FactCheck ట్వీట్ చేసింది. వాస్తవ జీవోలో 60 నుంచి 62 సం.కు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉందని తెలిపింది. కొందరు తప్పుడు జీవోను ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.