News August 29, 2025

పవన్ వైసీపీ టార్గెట్ వెనుక సుగాలి ప్రీతి వ్యవహారం?

image

జనసేన పార్టీ సమావేశాలతో విశాఖలో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హఠాత్తుగా <<17553693>>రుషికొండ భవనాలను<<>> సందర్శించి వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అయితే <<17548354>>సుగాలి ప్రీతి<<>> వ్యవహారాన్ని వైసీపీ ఎత్తుకోవడంతోనే పవన్ ఈ రుషికొండ వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానిలో భాగంగానే పవన్ కౌంటర్‌ స్ట్రాటజీ మొదలుపెట్టారని సమాచారం.

Similar News

News August 30, 2025

NGKL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడుగురికి జైలు శిక్ష

image

నాగర్‌కర్నూల్‌లో మద్యం తాగి, వాహనాలు నడిపిన ఏడుగురికి స్థానిక న్యాయస్థానం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. జమిస్తాపూర్ గ్రామానికి చెందిన భగవంత్‌కు ఐదు రోజుల జైలు శిక్షతోపాటు రూ.2,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరో ఆరుగురికి ఒక్కరోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించిందన్నారు.

News August 30, 2025

MBNR: అడ్డకల్ PS.. SP ప్రత్యేక ఫోకస్

image

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News August 30, 2025

వెల్గటూర్: విద్యార్థుల చదువుల కోసం స్థల పరిశీలన

image

వెల్గటూర్ మండలం స్తంభంపల్లి & పాసిగామ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూ స్థలాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ అలుగు వర్షిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థుల చదువుల కోసం డిగ్రీ, పీజీ, బీ ఫార్మసీ కోర్సుల కొరకు అన్ని విధాల సదుపాయాలు ఉండేలా ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగింది అని మంత్రి తెలిపారు.