News August 29, 2025
సిరిసిల్ల : ‘వెంటనే బకాయిలు రద్దు చేయాలి’

విద్యుత్ బ్యాక్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ సెస్ కార్యాలయం ముందు వస్త్ర యజమానులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం 50% సబ్సిడీతో పవర్లూమ్ పరిశ్రమలను ఆదుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాక్ బిల్లింగ్ పేరుతో 10 హెచ్పి మోటర్ లకు మినహా మిగతా వాటికి విద్యుత్ బకాయిలను వసూలు చేయడం సరైనది కాదని యజమానులు పేర్కొన్నారు. వెంటనే బకాయిలు రద్దుచేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 30, 2025
ఎచ్చెర్ల: ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బరు నిర్మాణ స్థలాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీస్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఏపీ మారిటైం బోర్డు ఎస్ఈ నాగేష్, సీఐ సీఈఎఫ్ డైరెక్టర్ ఎన్.రవిశంకర్, మత్స్యశాఖ డీడీ వై.సత్య నారాయణ, ఎఫ్‌డీవో రవి తదితరులు ఉన్నారు.
News August 30, 2025
శుభ సమయం (30-08-2025) శనివారం

✒ తిథి: శుక్ల సప్తమి రా.7.43 వరకు
✒ నక్షత్రం: విశాఖ మ.1.07 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: సా.5.32-7.18 వరకు
✒ అమృత ఘడియలు: మ.4.09-5.55 వరకు
News August 30, 2025
జగిత్యాల: ‘ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి’

త్వరలో జరిగే స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అందరు కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ లతా కోరారు. జగిత్యాల కలెక్టరేట్ లో శుక్రవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పొలిటికల్ పార్టీ రిప్రెసెంటేటివ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.