News August 29, 2025
విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రెకగ్నిషన్ తప్పనిసరి: సీఎం రేవంత్

TG: స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రెకగ్నిషన్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని CM రేవంత్ ఆదేశించారు. ‘మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలి. పాఠశాలల‌్లో క్రీడలకు ప్రాధాన్యమిచ్చి, అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో PETలను నియమించాలి. బాలికలకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాల’ని అధికారులకు సూచించారు.
Similar News
News August 30, 2025
ఇజ్రాయెల్ దాడుల్లో హౌతీ ప్రధాని హతం!

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హౌతీ ప్రధాని అహ్మద్ అల్-రహ్వీ హతమైనట్లు తెలుస్తోంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన దాడుల్లో అహ్మద్‌తోపాటు రక్షణమంత్రి మొహమ్మద్ అల్-అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అల్-ఘమారీ కూడా చనిపోయినట్లు సమాచారం. వీరి మరణాలపై హౌతీల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కొద్దిరోజులుగా హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేస్తోంది.
News August 30, 2025
నాకు కులం, మతంతో పని లేదు: పవన్

AP: కులం, మత, ప్రాంతాలకు జనసేన అతీతం అని పవన్ అన్నారు. ‘నేను ఇస్లాం, క్రిస్టియన్ ఇతర మతాలను ఎంతో గౌరవిస్తాను. నాకు కులం, మతంతో పనిలేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను, వారి సంప్రదాయాలను, మనోభావాలను కించపరిచే వారి విషయంలో సూటిగా మాట్లాడతాను. నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడగలిగే ధైర్యం నాకు ఉంది. ఒక మాట మాట్లాడితే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం లేదు’ అని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
News August 30, 2025
డిసెంబర్‌లో ఇండియాకు పుతిన్!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత పర్యటనకు రానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత మేలో ప్రధాని మోదీ పుతిన్‌ను ఇండియాకు రావాలని ఆహ్వానించారు. కాగా సెప్టెంబర్ 1న చైనాలో జరిగే ప్రాంతీయ సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కలవనున్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.