News August 29, 2025
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41.50 అడుగులు

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 41.50 అడుగులకు చేరింది. దిగువ ప్రాంతానికి 8,68,724 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News August 30, 2025
బ్రహ్మంగారిమఠంలో పుష్ప నటుడు

బ్రహ్మంగారిమఠంలోని జగద్గురు శ్రీ మద్వివిరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని శుక్రవారం పుష్ప సినిమా నటుడు కేశవ దర్శించుకున్నారు. ఆయనకు మఠం యాజమాన్యం ప్రత్యేక స్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన దర్శనానికి రావడంతో అభిమానులు సెల్ఫీలు దిగారు.
News August 30, 2025
విశాఖలో యుద్ధ విమాన మ్యూజియం మూసివేత

విశాఖ బీచ్ రోడ్డులోని TU-142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్ 1 నుంచి 2వ తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 3 నుంచి మ్యూజియం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని VMRDA కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు.
News August 30, 2025
ఓటు వేయాలి.. బెయిల్ ఇవ్వండి: రాజంపేట MP

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందో? లేదో? చూడాలి మరి.