News August 29, 2025

2,534 పోలింగ్ కేంద్రాలు: జనగామ కలెక్టర్

image

జిల్లాలో 12 మండలాల్లోని 280 గ్రామ పంచాయతీల్లో 2,534 వార్డులకు గాను 2,534 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాపై అఖిలపక్ష పార్టీలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మహిళా ఓటర్లు 2,02,906 ఉండగా, పురుషులు 1,98,466, ఇతరులు 8 మంది, మొత్తంగా 4,01,380 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటరు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు అందించవచ్చన్నారు.

Similar News

News August 30, 2025

పెద్దపల్లి: ‘పిల్లలను ఎత్తుకొని బిక్షాటన చేస్తే కఠిన చర్యలు’

image

పిల్లలను ఎత్తుకొని భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు హెచ్చరించారు. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద బిడ్డను ఎత్తుకొని బిక్షాటన చేస్తున్న ఒక మహిళను చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రమాదేవి, సంతోష్ రెస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు మహిళకు, ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

News August 30, 2025

గిద్దలూరులో రైతు బజార్ స్థల సమీకరణకు ఎమ్మెల్యే అశోక్‌కు వినతి

image

గిద్దలూరు పట్టణంలో శుక్రవారం MLA అశోక్ రెడ్డిను జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు వరలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు రైతు బజారు ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణకు వివరాలు తెలుసుకున్నారు. రైతుల కోసం కూటమి ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

News August 30, 2025

ఈనెల 1న రూ.113.36 కోట్లు పెన్షన్ నగదు పంపిణీ: కలెక్టర్

image

సెప్టెంబరు నెలలో 2,61,221 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద రూ.113.36 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఏలూరులో అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. సెప్టెంబరు 1న ఉదయం 7 గంటలకు ఈ పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. 5,275 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.