News August 29, 2025
గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు సమావేశం: కలెక్టర్

కోనసీమ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, 2019 నుంచి 6 సంవత్సరాలలో ఏ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీల ప్రతినిధులు సెప్టెంబర్ 8వ తేదీన అమరావతిలో నిర్వహించి సమావేశానికి హాజరు కావాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ జిల్లాలో ఏ ఒక్క ఎన్నికలో 6 ఏళ్లలో పోటీ చేయలేదన్నారు.
Similar News
News August 30, 2025
TODAY HEADLINES

* ఏపీకి బుల్లెట్ ట్రైన్: CM చంద్రబాబు
* విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రెకగ్నిషన్: CM రేవంత్
* జపాన్ పర్యటనలో మోదీ.. పలు ఒప్పందాలు
* భారత్-చైనా స్నేహం ప్రపంచానికి ముఖ్యం: మోదీ
* రుషికొండ నిర్మాణాలను వినియోగిస్తాం: Dy.CM
* భవిష్యత్తులో ఏఐ రెవల్యూషన్: లోకేశ్
* ఇక నుంచి వేగంగా పెన్షన్లు: మంత్రి సీతక్క
* హీరోయిన్ ధన్సికతో హీరో విశాల్ నిశ్చితార్థం
News August 30, 2025
మంచి స్పాన్సర్ కోసం BCCI ఎదురుచూపు!

టీమ్ ఇండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11 తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వేట మొదలుపెట్టింది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉండే స్పాన్సర్ కోసం బోర్డు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టనుండటంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌లో భారత జట్టును ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. సరైన స్పాన్సర్ దొరికే వరకు వేచి చూడాలనే ధోరణిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
News August 30, 2025
ఇజ్రాయెల్ దాడుల్లో హౌతీ ప్రధాని హతం!

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హౌతీ ప్రధాని అహ్మద్ అల్-రహ్వీ హతమైనట్లు తెలుస్తోంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన దాడుల్లో అహ్మద్‌తోపాటు రక్షణమంత్రి మొహమ్మద్ అల్-అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అల్-ఘమారీ కూడా చనిపోయినట్లు సమాచారం. వీరి మరణాలపై హౌతీల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కొద్దిరోజులుగా హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేస్తోంది.