News August 29, 2025

పాలమూరు: ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమావేశం

image

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, పంచాయితీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అంటించామని చెప్పారు.

Similar News

News August 30, 2025

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.

News August 30, 2025

MBNR: అడ్డకల్ PS.. SP ప్రత్యేక ఫోకస్

image

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News August 30, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. బొక్కలోనిపల్లికి చెందిన అజయ్ కుమార్ మహబూబ్‌నగర్ పట్టణంలోని కొత్త ఆర్టీవో ఆఫీస్ మైసమ్మ దేవాలయం పక్కన బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా EMT లక్ష్మణ్ గౌడ్, పైలెట్ కృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.