News August 29, 2025

జైపూర్: ‘నష్టపరిహారం అందించేందుకు చర్యలు’

image

జైపూర్ మండలంలోని కిష్టాపూర్, వేలాల గ్రామాలలో భారీ వర్షంతో వరద ముంపుకు గురైన పంట పొలాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంటల వివరాలు, సంబంధిత రైతుల వివరాలతో పూర్తిస్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. నివేదికలో అర్హులైన రైతుల వివరాలు మాత్రమే ఉండాలని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News August 30, 2025

ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

image

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం

News August 30, 2025

ALLERT: భద్రాద్రి జిల్లాకు 5 రోజుల వర్ష సూచన

image

రానున్న 5 రోజులు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆగస్టు 30, సెప్టెంబర్ 1న భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 31న అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు. 5 రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఎరువులు, పురుగుల మందులు పంటపొలాలపై చల్లకూడదని నోడల్ ఆఫీసర్ హరీష్ కుమార్ శర్మ తెలిపారు.

News August 30, 2025

స్టేషన్ ఘనపూర్: స్వాతంత్ర్య సమరయోధుడి మృతి.. నేత్రాలు దానం

image

స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, పడకంటి గుండయ్య (97) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆయన కుమారులు తన తండ్రి నేత్రాలను వరంగల్ రీజినల్ కంటి దవాఖానాకు దానం చేశారు. డాక్టర్.నరేందర్ నేత్రాలను సేకరించినట్లు ఆయన కుమారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.