News August 29, 2025

MBNR: ముగిసిన పీజీ పరీక్షలు.. 1,113 మంది హాజరు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎంకాం రెగ్యులర్ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు నేటితో ముగిశాయి. పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డాక్టర్ నాగం కుమారస్వామి పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ పరిధిలో 1,196 మంది విద్యార్థులకు గాను 1,113 మంది హాజరయ్యారని, 83 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.కే.ప్రవీణ తెలిపారు.

Similar News

News August 30, 2025

మెదక్‌: దెబ్బతిన్న 60 పీఆర్ రోడ్లు డ్యామేజ్

image

మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 29 చోట్ల కల్వర్టులు, 14 చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీర్ నర్సింలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.17.11 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.

News August 30, 2025

VKB: జిల్లాలో 594 పంచాయతీలు 5058 వార్డులు

image

జిల్లాలో ఓటర్ల వివరాలను పంచాయతీ కార్యాలయాల వద్ద డిస్‌ ప్లే చేశారు. వికారాబాద్ జిల్లాలో 594 గ్రామపంచాయతీలు 5058 వార్డులు ఉన్నట్లు జిల్లా అధికారులు దృవీకరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వద్ద ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.

News August 30, 2025

ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

image

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం