News August 29, 2025

డెడ్ ఎకానమీ కాదు ట్రంప్.. గుడ్ ఎకానమీ!

image

ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ హేళనగా మాట్లాడిన ట్రంప్‌కు భారత <<17555786>>GDP<<>> దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 2025-26 FYలో Q1లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని నమోదు చేసింది. 2025 Q1లో US గ్రోత్ రేటు -0.5. అటు చైనా 5.2% వృద్ధిని సాధించింది. భారత వ్యవసాయ, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాలు రాణించాయి. IND ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని, టారిఫ్స్ విధించినా పెద్దగా నష్టం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Similar News

News August 30, 2025

2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం: అధికారులు

image

TG: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కామారెడ్డిలో 77వేల ఎకరాలు, మెదక్‌లో 23వేలు, ADBలో 21 వేలు, NZBలో 18వేలు, ఆసిఫాబాద్‌లో 15వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వెల్లడించారు. ఇందులో 1.09 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

News August 30, 2025

ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

image

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం

News August 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.