News August 29, 2025

సాఫ్ట్‌వేర్ టూ సినీ ఫీల్డ్.. నరసన్నపేట యువకుడి విజయ గాథ

image

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నరసన్నపేట(M) కోమర్తికి చెందిన అట్టాడ సృజన్ నిరూపించారు. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాలపై మక్కువతో డైరెక్టర్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం ఆనంద్ దేవకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాకు కథ రాయడంతోపాటు దర్శకత్వం వహించారు. తన డైరెక్షన్‌లో ఇటీవల విడుదైన ‘కన్యాకుమారి’ సినిమాలో శ్రీకాకుళం అందాలను చాలా బాగా చూపించారు. సృజన్ తండ్రి అట్టాడ అప్పలనాయుడు ప్రముఖ కవి.

Similar News

News August 30, 2025

ఎచ్చెర్ల: ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన

image

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బరు నిర్మాణ స్థలాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీస్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఏపీ మారిటైం బోర్డు ఎస్ఈ నాగేష్, సీఐ సీఈఎఫ్ డైరెక్టర్ ఎన్.రవిశంకర్, మత్స్యశాఖ డీడీ వై.సత్య నారాయణ, ఎఫ్‌డీవో రవి తదితరులు ఉన్నారు.

News August 30, 2025

ఎచ్చెర్ల: వర్శిటీలో నూతన సమావేశ మందిరానికి ‘గిడుగు’ పేరు

image

డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పరిపాలనా భవనంలో ఒక సమావేశ మందిరానికి గిడుగు వేంకట రామ్మూర్తి పేరు పెట్టనున్నట్లు వర్శిటీ వీసి. రజని తెలిపారు. శుక్రవారం గిడుగు జయింతిని క్యాంపస్‌లో నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి వర్శిటీ అధికారులు నివాళులర్పించారు. చరిత్ర కలిగిన తెలుగు భాషను పరిరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.

News August 30, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

నరసన్నపేట: సాఫ్ట్ వేర్ టూ సినీ ఫీల్డ్
సంతబొమ్మాళిలో ఇద్దరిని కాటేసిన పాము
విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా నిలవాలి: రామ్మోహన్
జిల్లాలో పలు చోట్ల తెలుగు భాషా దినోత్సవం
లావేరులో 8 బైక్‌లు సీజ్
విద్యుత్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
సోంపేట: బస్సు దిగుతూ జారిపడి హెచ్ఎం మృతి
ఎల్.ఎన్ పేట: జడ్పీ ఉన్నత పాఠశాలలో దొంగల హాల్‌చల్
ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి