News August 29, 2025

రుషికొండ ప్యాలెస్‌పై మంత్రులతో కమిటీ

image

AP: రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిని నియమించింది. వీరు ఈ రిసార్ట్‌ను ఎలా వినియోగించాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ నివేదిక ప్రకారం సర్కార్ చర్యలు తీసుకుంటుంది.

Similar News

News August 30, 2025

వారికి పదవీ విరమణ వయసు పెంపు ఫేక్: ఏపీ ఫ్యాక్ట్ చెక్

image

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News August 30, 2025

2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం: అధికారులు

image

TG: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కామారెడ్డిలో 77వేల ఎకరాలు, మెదక్‌లో 23వేలు, ADBలో 21 వేలు, NZBలో 18వేలు, ఆసిఫాబాద్‌లో 15వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వెల్లడించారు. ఇందులో 1.09 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

News August 30, 2025

ఆగస్టు 30: చరిత్రలో ఈ రోజు

image

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం