News August 29, 2025
గద్వాల: ‘తుది ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి’

తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలోని ఆయన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని జీపీ ఆఫీసుల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ఈనెల 28న ప్రదర్శించామన్నారు. 30 వరకు అభ్యంతరాల స్వీకరించి 31న పరిష్కరిస్తామన్నారు.
Similar News
News August 30, 2025
31 లోపు అభ్యంతరాల స్వీకరణ: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో ఓటర్ ముసాయిదా జాబితాపై జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గురువారం విడుదల చేసిన వార్డు, గ్రామ పంచాయతీ ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 31వ తేదీలోగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
News August 30, 2025
వారికి పదవీ విరమణ వయసు పెంపు ఫేక్: ఏపీ ఫ్యాక్ట్ చెక్

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News August 30, 2025
KMR: జిల్లాలో రూ.130.37 కోట్ల వరద నష్టం అంచనా

ఇటీవల కామారెడ్డి జిల్లాలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా నివేదిక శుక్రవారం విడుదలైంది. జిల్లా యంత్రాంగం సేకరించిన సమాచారం ప్రకారం, మొత్తం నష్టం రూ.130.37 కోట్లుగా అంచనా వేయబడింది. దీనిలో తక్షణ మరమ్మతులకు రూ.22.47 కోట్లు అవసరమని పేర్కొంది. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.