News August 29, 2025

ఒకేసారి 5 ఉద్యోగాలు కొట్టిన ‘అమ్మ’

image

AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరుబుజ్జిలి(M) మతలబుపేటకు చెందిన చింతా రాధాకుమారి-కేఎల్ నాయుడుకు ఇద్దరు పిల్లలు. ఎప్పటికైనా టీచర్ కావాలనే ఆశయంతో సంసారాన్ని నడిపిస్తూనే రాధ MA, లాంగ్వేజ్ పండిట్ కోర్స్, TTC, B.Ed పూర్తి చేశారు. ఇటీవల ప్రకటించిన DSCలో SGT-14, SA తెలుగు-23, SA సోషల్-39, TGT తెలుగు-113,TGT సోషల్‌లో 77వ ర్యాంక్ సాధించారు.

Similar News

News August 30, 2025

మరోసారి తల్లి కాబోతున్న నటి

image

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

News August 30, 2025

వారికి పదవీ విరమణ వయసు పెంపు ఫేక్: ఏపీ ఫ్యాక్ట్ చెక్

image

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News August 30, 2025

2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం: అధికారులు

image

TG: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కామారెడ్డిలో 77వేల ఎకరాలు, మెదక్‌లో 23వేలు, ADBలో 21 వేలు, NZBలో 18వేలు, ఆసిఫాబాద్‌లో 15వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వెల్లడించారు. ఇందులో 1.09 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.