News August 29, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా స్పోర్ట్స్ డే
> స్టేషన్ ఘనపూర్: యూరియా కోసం రైతుల పడిగాకులు
> దేవాదాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష
> కొడకండ్ల: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత
> మేకలగట్టు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్
> ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
> ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్
> దేవరుప్పుల: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

Similar News

News August 30, 2025

మరోసారి తల్లి కాబోతున్న నటి

image

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

News August 30, 2025

31 లోపు అభ్యంతరాల స్వీకరణ: ములుగు కలెక్టర్

image

ములుగు కలెక్టరేట్‌లో ఓటర్ ముసాయిదా జాబితాపై జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గురువారం విడుదల చేసిన వార్డు, గ్రామ పంచాయతీ ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 31వ తేదీలోగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News August 30, 2025

వారికి పదవీ విరమణ వయసు పెంపు ఫేక్: ఏపీ ఫ్యాక్ట్ చెక్

image

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.