News August 29, 2025
GDK: ‘తెలంగాణ యూరియా కొరతపై పార్లమెంట్లో ప్రస్తావించా’

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతపై పార్లమెంటులో ప్రస్తావించానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చే యూరియా కోటాను పూర్తి స్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులను కోరానని, రామగుండంలో ఎయిర్పోర్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాల గురించి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశానని అన్నారు.
Similar News
News August 30, 2025
మరోసారి తల్లి కాబోతున్న నటి

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
News August 30, 2025
31 లోపు అభ్యంతరాల స్వీకరణ: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో ఓటర్ ముసాయిదా జాబితాపై జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గురువారం విడుదల చేసిన వార్డు, గ్రామ పంచాయతీ ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 31వ తేదీలోగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
News August 30, 2025
వారికి పదవీ విరమణ వయసు పెంపు ఫేక్: ఏపీ ఫ్యాక్ట్ చెక్

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.