News April 2, 2024
విశాఖ: విద్యార్థిని మృతి కేసులో ఐదుగురు అరెస్టు

కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.
Similar News
News February 2, 2026
విశాఖ:100 రోజులు బంగ్లాదేశ్‌లో బందీలుగా

విశాఖ నుంచి వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చొరబడటంతో<<19027027>> 100 రోజులు బందీలుగా<<>> అక్కడ వేదన జీవితాన్ని గడిపారు. సోమవారం విశాఖ చేరుకున్న వీరికి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులు సన్మానించి కన్నీటి పర్యంతం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో సుధాసాగర్ వీరికి నిత్యవసర సరకులు అందించారు.
News February 2, 2026
విశాఖ ఐటీ, లాజిస్టిక్స్ అభివృద్ధికి మద్దతు – CII

తూర్పు తీరంలో విశాఖ నగరం ప్రముఖ పరిశ్రమ Hubగా మారడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ దోహదపడుతుందని సీఐఐ విశాఖ ప్రతినిధులు జి.కృష్ణ మోహన్, డీవీఎస్ నారాయణ రాజు, సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 2047 వరకు డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, బయోఫార్మాకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈలకు రూ.10,000 కోట్లు కేటాయింపు, ఎకనామిక్-ఫ్లైట్ కారిడార్‌ల అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పాటును అందిస్తుందన్నారు.
News February 2, 2026
విశాఖ: ప్రభుత్వం కార్యాలయలలో నేడు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గత వారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.


