News August 30, 2025
డిసెంబర్‌లో ఇండియాకు పుతిన్!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత పర్యటనకు రానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత మేలో ప్రధాని మోదీ పుతిన్‌ను ఇండియాకు రావాలని ఆహ్వానించారు. కాగా సెప్టెంబర్ 1న చైనాలో జరిగే ప్రాంతీయ సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కలవనున్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News August 30, 2025
మరోసారి తల్లి కాబోతున్న నటి

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
News August 30, 2025
వారికి పదవీ విరమణ వయసు పెంపు ఫేక్: ఏపీ ఫ్యాక్ట్ చెక్

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News August 30, 2025
2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం: అధికారులు

TG: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కామారెడ్డిలో 77వేల ఎకరాలు, మెదక్‌లో 23వేలు, ADBలో 21 వేలు, NZBలో 18వేలు, ఆసిఫాబాద్‌లో 15వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వెల్లడించారు. ఇందులో 1.09 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.