News August 30, 2025
దామరగిద్ద: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి శిక్ష

నారాయణపేట బస్టాండ్‌లో దొంగతనాలు చేసిన దామరగిద్ద మండలం మద్దెలబీడు వాసి హనుమంతుకు JFCM జడ్జి సాయి మనోజ్ ఏడు నెలల 8 రోజుల శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారని సీఐ శివశంకర్ తెలిపారు. గత సంవత్సరం మార్చి, జూన్ నెలల్లో నారాయణపేట వాసి లక్ష్మి బస్ ఎక్కుతుండగా హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న 6 వేలు, 6 గ్రాముల బంగారం, మాగనూరు మండలం నేరడగం వాసి కవిత బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేలు, తులం బంగారం చోరీ చేశాడన్నారు.
Similar News
News August 30, 2025
సింధు ఓటమి.. సాత్విక్ జోడీపైనే ఆశలు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్ డబుల్స్ ద్వయం సాకేత్-చిరాగ్ విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నం.2 జోడీ ఆరోన్, సో వూయ్‌పై 21-12, 21-19 తేడాతో నెగ్గారు. దీంతో కాంస్యం ఖరారు చేసుకున్నారు. మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ప్లేయర్ వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 పాయింట్ల తేడాతో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ ఇంటి దారి పట్టింది.
News August 30, 2025
సంగారెడ్డి: గ్రామాల్లో మొదలైన ఎన్నికల వేడి

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పంచాయతీ శాఖ అన్ని పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించింది. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై చర్చ జరుగుతుంది. గ్రామాల్లో ఏ రిజర్వేషన్ వస్తుందేయోనని నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు బట్టి పోటీ చేద్దామని నాయకులు చర్చలు జరుపుతున్నారు.
News August 30, 2025
నేటి నుంచి అసెంబ్లీ.. ‘కాళేశ్వరం’పై చర్చ!

TG: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ సెషన్ నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలో ధీటుగా బదులిచ్చేందుకు బీఆర్ఎస్ నేతలకు చీఫ్ KCR దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ చర్చలకు <<17553800>>ఆయన<<>> హాజరయ్యే విషయమై అంతా ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా చూడాలని స్పీకర్ పోలీసులకు సూచించారు.