News August 30, 2025
నాకు కులం, మతంతో పని లేదు: పవన్

AP: కులం, మత, ప్రాంతాలకు జనసేన అతీతం అని పవన్ అన్నారు. ‘నేను ఇస్లాం, క్రిస్టియన్ ఇతర మతాలను ఎంతో గౌరవిస్తాను. నాకు కులం, మతంతో పనిలేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను, వారి సంప్రదాయాలను, మనోభావాలను కించపరిచే వారి విషయంలో సూటిగా మాట్లాడతాను. నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడగలిగే ధైర్యం నాకు ఉంది. ఒక మాట మాట్లాడితే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం లేదు’ అని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
Similar News
News August 30, 2025
సింధు ఓటమి.. సాత్విక్ జోడీపైనే ఆశలు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్ డబుల్స్ ద్వయం సాకేత్-చిరాగ్ విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నం.2 జోడీ ఆరోన్, సో వూయ్‌పై 21-12, 21-19 తేడాతో నెగ్గారు. దీంతో కాంస్యం ఖరారు చేసుకున్నారు. మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ప్లేయర్ వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 పాయింట్ల తేడాతో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ ఇంటి దారి పట్టింది.
News August 30, 2025
నేటి నుంచి అసెంబ్లీ.. ‘కాళేశ్వరం’పై చర్చ!

TG: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ సెషన్ నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలో ధీటుగా బదులిచ్చేందుకు బీఆర్ఎస్ నేతలకు చీఫ్ KCR దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ చర్చలకు <<17553800>>ఆయన<<>> హాజరయ్యే విషయమై అంతా ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా చూడాలని స్పీకర్ పోలీసులకు సూచించారు.
News August 30, 2025
మరోసారి తల్లి కాబోతున్న నటి

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.