News August 30, 2025
పెద్దపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

పెద్దపల్లి జిల్లాలో గత 24 గంటల్లో వర్షాలు విస్తృతంగా కురిశాయి. రామగిరిలో 83.3 మి.మీ, కమాన్‌పూర్ 75.6, జూలపల్లి 54.4, ముత్తారం 46.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి 34.9, ధర్మారం 27.9, ఎలిగేడు 26.0, పాలకుర్తి 16.8 ఓదెల 12.4, శ్రీరాంపూర్ 18.7 మి.మీ. వర్షం కురిసింది. అంతర్గాంలో 8.4, మంథని 7.0, రామగుండం 6.1 తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News August 30, 2025
నేటి నుంచి అసెంబ్లీ.. ‘కాళేశ్వరం’పై చర్చ!

TG: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ సెషన్ నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలో ధీటుగా బదులిచ్చేందుకు బీఆర్ఎస్ నేతలకు చీఫ్ KCR దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ చర్చలకు <<17553800>>ఆయన<<>> హాజరయ్యే విషయమై అంతా ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా చూడాలని స్పీకర్ పోలీసులకు సూచించారు.
News August 30, 2025
మరోసారి తల్లి కాబోతున్న నటి

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
News August 30, 2025
31 లోపు అభ్యంతరాల స్వీకరణ: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో ఓటర్ ముసాయిదా జాబితాపై జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గురువారం విడుదల చేసిన వార్డు, గ్రామ పంచాయతీ ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 31వ తేదీలోగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.